శుక్రవారం 10 జూలై 2020
National - Jun 02, 2020 , 10:44:05

యుద్ధ‌నౌక‌లో ట్యూటికోరిన్ చేరుకు‌న్న 685 మంది భార‌తీయులు

యుద్ధ‌నౌక‌లో ట్యూటికోరిన్ చేరుకు‌న్న 685 మంది భార‌తీయులు

హైద‌రాబాద్‌:  ఆప‌రేష‌న్ స‌ముద్ర‌సేతు ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను భారీ నౌక‌ల్లో త‌ర‌లిస్తున్న విష‌యం తెలిసిందే.  క‌రోనా వైర‌స్‌తో ఏర్ప‌డ్డ‌ లాక్‌డౌన్ వ‌ల్ల అన్ని ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు స్తంభించాయి.  ఈ నేప‌థ్యంలో చేప‌ట్టిన ఆప‌రేష‌న్ స‌ముద్ర‌సేతులో భాగంగా ఇవాళ యుద్ధ‌నౌక ఐఎన్ఎస్ జ‌ల‌ష్వా ద్వారా సుమారు 685 మంది భార‌తీయుల్ని .. కొలంబో నుంచి త‌మిళ‌నాడులోని ట్యూటికోరిన్‌కు తీసుకువ‌చ్చారు.  ట్యూటికోరిన్‌లో ఉన్న వీవో చిదంబ‌రాన‌ర్ పోర్టుకు జ‌ల‌ష్వా నౌక చేరుకున్న‌ది. భార‌త ప్ర‌భుత్వం త‌మ‌ను వెన‌క్కి తీసుకురావ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌ని ప్ర‌యాణికులు తెలిపారు. 


logo