Infosys | దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) ఉద్యోగులకు (employees) షాక్ ఇచ్చింది. రెండేళ్ల క్రితం ఫ్రెషర్ల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించిన ఇన్ఫీ.. గతేడాది వారిని విధుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా అందులోని కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు (Mysuru) క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మంది ట్రైనీలకు (trainees) లేఆఫ్‌లు (Layoffs) ఇచ్చేందుకు రెడీ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. వరుసగా మూడు సార్లు అంచనా పరీక్షల్లో విఫలమైన కారణంగా వారిని తొలగిస్తున్నట్లు తెలిసింది.
ట్రైనీలను 50 మందితో కూడిన బ్యాచ్‌లుగా పిలిచి వారితో మ్యూచువల్ సెపరేషన్ లెటర్లపై సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం 6 గంటల్లోపు ట్రైనీలంతా క్యాంపస్‌ను వీడాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది. అయితే, ట్రైనీల తొలగింపుపై ఇన్ఫీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. లేఆఫ్‌లకు గురైన ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు జాతీయ మీడియా నివేదించింది. తాము ఫెయిల్ అవ్వాలనే పరీక్షలను చాలా కఠినంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమ భవిష్యత్తు కష్టంగా మారిందంటూ వాపోతున్నారు.
Also Read..
Ratan Tata | రతన్ టాటా వీలునామాలో రహస్య వ్యక్తి పేరు.. ఇంతకీ ఎవరీ మిస్టరీ మ్యాన్..?
Maha Kumbh Mela | మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం