Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభ మేళా (Maha kumbha Mela)లో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. శంకరాచార్య మార్గ్ (Shankaracharya Marg)లోని సెక్టార్ 18లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు మంటల్లో కాలిపోతున్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
#WATCH | Prayagraj | A fire breaks out in Sector 18, Shankaracharya Marg of Maha Kumbh Mela Kshetra. Fire tenders are at the spot. More detail awaited pic.twitter.com/G4hTeXyRd9
— ANI (@ANI) February 7, 2025
కాగా, ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన ఈ కుంభమేళాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా గత నెల 29వ తేదీన కుంభమేళా ప్రాంతంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మంది గాయపడ్డారు. ఇక కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి అప్పటి వరకూ అక్కడ అగ్నిప్రమాదం జరగడం ఇది నాలుగోసారి.
తొలుత ఈనెల 19వ తేదీన మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. నల్లటి దట్టమైన పొగలు అలుముకోవడంతో అఖాడాల సమీపంలో భయాందోళన నెలకొంది. సాయంత్రం 4 గంటలకు మంటలు అంటుకోగా గంటలోపలే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఆతర్వాత వారం రోజులకే అంటే ఈనెల 25వ తేదీన మరోసారి అగ్నిప్రమాదం జరిగింది.
కుంభమేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్ 2 సమీపంలోని పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. అక్కడ విపరీతమైన వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఓ కారు పూర్తిగా దగ్ధం కాగా, మరో కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత జనవరి 30న సెక్టర్ 22లో ఛత్నాగ్ ఝాన్సీ (Chhatnag Jhunsi) ప్రాంతంలో నిర్మించిన టెంట్ సిటీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డజనుకుపైగా టెంట్లు కాలిపోయాయి. అయితే, ఈ మూడు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
Also Read..
Repo Rate | రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్బీఐ.. ఐదేళ్ల తర్వాత తొలిసారి
Sachin Tendulkar | ఫ్యామిలీతో కలిసి రాష్ట్రపతిని కలిసిన సచిన్ టెండూల్కర్.. ఫొటోలు వైరల్
Donald Trump | ట్రంప్ మరో కఠిన నిర్ణయం.. ఆ సంస్థలోని 9,700 మంది ఉద్యోగుల తొలగింపు..!