Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే వివిధ దేశాలపై సుంకాలను వడ్డిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా పలు దేశాలపై ఆంక్షలు, వలసదారుల పట్ల కఠిన వైఖరితో వ్యవహరిస్తూ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. తాజాగా అమెరికాలోని కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అతిపెద్ద సహాయ సంస్థ అయిన ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ (USAID)లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయ్యారు.
యూఎస్ఏఐడీలో ప్రస్తుతం 10వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ క్రమంలో 9,700 మందికిపైగా ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్లాన్ చేస్తోంది. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో, ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో ఉండేలా సవరణలు కూడా చేసినట్లు సమాచారం.
Also Read..
గాజాస్ట్రిప్ను వీడేవాళ్లకు సాయం
Congo | కాంగోలో తిరుగుబాటుదారుల అకృత్యాలె.. వందలాది మహిళా ఖైదీలపై రేప్, సజీవ దహనం
Star Links | కూలుతున్న స్టార్లింక్స్.. ఎలాన్ మస్క్ కంపెనీతో భారీగా వాతావరణ కాలుష్యం