Congo | గోమా, ఫిబ్రవరి 6 : రువాండా మద్దతు కలిగిన తిరుగుబాటుదారుల అకృత్యాలతో కాంగోలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే గోమా నగరాన్ని, బుకావు ప్రొవిన్సియల్ రాజధానికి సమీపాన ఉన్న మరో పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్న ఎం23 రెబల్స్.. గోమాలోని మున్జెంజి జైల్లోని వందలాది మహిళా ఖైదీలపై లైంగిక దాడి చేసి వారిని సజీవ దహనం చేశారు. బాధితులంతా చనిపోయినట్టు ఐరాస సీనియర్ అధికారి తెలిపారు. హింసలో సుమారు 2 వేల మంది హత్యకు గురయ్యారని.. అందులో 787 మంది మృతదేహాలు ఇంకా దవాఖానల్లోనే ఉన్నాయని ఆయన చెప్పారు.