Star Links | న్యూయార్క్, ఫిబ్రవరి 6 : ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్‌లింక్ శాటిలైట్లు క్రాష్ అవుతున్నాయి. భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతున్నాయి. 2025 జనవరి నెలలోనే సుమారు 120కి పైగా స్టార్‌లింక్స్ క్రాష్ అయ్యాయి. ఈ మేరకు అంతరిక్షంలోని వస్తువులపై అధ్యయనం చేసే ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డొవెల్ వెల్లడించారు. ‘రోజూ 4-5 స్పేస్ ఎక్స్ శాటిలైట్లు భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోతున్నాయి’ అని ఆయన తెలిపారు.
ఆ కంపెనీ ప్రవేశపెట్టిన మొత్తం 4700 జెన్ 1 శాటిలైట్లలో సుమారు 500 వరకు శాటిలైట్ల జీవితకాలం ముగింపు దశకు వచ్చినట్టు సమాచారం. వీటి స్థానంలో కొత్త మోడల్ శాటిలైట్లను ప్రవేశపెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది.శాటిలైట్ల క్రాష్ వల్ల వాతావరణానికి కలిగే నష్టంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల ఓజోన్ పొరకు నష్టం వాటిల్లుతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.