ఇప్పుడు నేనో అడుగడుగునా రగులుతూ
భగ్గుమంటున్న
అగ్నిశిఖ గురించి ప్రస్తావిస్తాను.
ధనమదాంధుల
గుండెలపై సవారి చేస్తూ
చాపకింద నీరులా
అణువణువునా అడుగడుగునా
ఆరితేరిన ఆరని మంట
ఇంటి గోడల
పొరలలో మూల్గుతున్న
నోట్ల కట్టలకి ఆనకట్టవేయు
ఉద్యమ రథసారథులకై
అన్వేషిస్తున్నాను
ప్రభంజనమై ప్రబలు
ప్రళయాగ్ని జ్వాల
నీతిలేని అవినీతిని
రూపుమాపగల
రక్షణ కవచ వీరసైనికులకై
అన్వేషిస్తున్నాను
బీదా బిక్కి సామాన్యుడి నడినెత్తిన
పిడుగులా పడుతూ
రావణకాష్టంలా దహిస్తూ
పెచ్చుపెరుగే అవినీతికి
చిచ్చును రగిలించే
లోకబంధువులకై అన్వేషిస్తున్నాను
రండి! కదిలిరండి
-డాక్టర్ కొరుప్రోలు హరనాధ్
703542598