Jobs | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) 2027 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా 480 ఖాళీలను నాలుగు ప్రధాన విభాగాల్లో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్) భర్తీ చేయనుంది. వీటిని వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల్లో గ్రూప్-ఎ, గ్రూప్-బి పోస్టులను నింపనుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. అక్టోబర్ 6 వరకు సాగుతుంది.
విభాగాలు
కేటగిరి-I (Civil Engineering)లో సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్స్ ఇంజినీరింగ్, సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్
కేటగిరీ-II (Mechanical Engineering)లో డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్వీసెస్, బోర్డర్ రోడ్స్ ఇంజినీరింగ్, ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్మెంట్ సర్వీస్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, సర్వే ఆఫ్ ఇండియా
కేటగిరీ-III (Electrical Engineering)లో ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్మెంట్, డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్, సెంట్రల్ పవర్ ఇంజినీరింగ్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్
కేటగిరీ-IV (Electronics and Telecommunication Engineering)లో ఇండియన్ టెలీకమ్యూనికేషన్ సర్వీస్, ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్మెంట్ సర్వీస్, డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్వీసెస్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్, ఇండియన్ రేడియో రెగ్యులేటరీ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్

Ese Posts
అర్హతలు
పోస్టును బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి. లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/సెక్షన్లు ఎ, బి అర్హత సాధించి ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్స్టిట్యూషన్ (ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష (Graduate Membership Test) పాసై ఉండాలి. లేదా ఎమ్మెస్సీ (వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్, రేడియో ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు
2027, జనవరి 1 నాటికి వయసు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 200. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక
స్టేజ్-1 (ప్రిలిమినరీ, పేపర్-1 200, పేపర్-2 300 మార్కులు), స్టేజ్-2 (మెయిన్స్, పేపర్-1 300, పేపర్-2 300మార్కులు), స్టేజ్-3 (పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ (Certification) ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి. మెయిన్ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. చివరితేదీ అక్టోబర్ 6. దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ https://upsc.gov.in చూడండి.

Ese Apply