మరణం దాటి… మరో ఇద్దరికి కంటి చూపు
ఒక ఆదర్శప్రాయమైన నిర్ణయం రెండు జీవితాల్లోని చీకట్లను తరిమి వెలుగులు నింపనుంది. కార్నియా అంధత్వంతో బాధపడే ఇద్దరికి కంటి చూపును ప్రసాదించనుంది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన యూటీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి తల్లి...
– గుడుగుంట్లపాలెం గ్రామస్థురాలు సోమమ్మ నేత్రదానం
– ఆదర్శంగా నిలిచిన యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడి కుటుంబం
నల్లగొండ, సెప్టెంబర్ 17 : ఒక ఆదర్శప్రాయమైన నిర్ణయం రెండు జీవితాల్లోని చీకట్లను తరిమి వెలుగులు నింపనుంది. కార్నియా అంధత్వంతో బాధపడే ఇద్దరికి కంటి చూపును ప్రసాదించనుంది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన యూటీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి తల్లి సోమమ్మ మంగళవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్ తో మరణించారు. దు:ఖంలోనూ ఆమె కుటుంబ సభ్యులు సోమమ్మ నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఐ డొనేషన్ సెంటర్ ను సంప్రందించగా, అదే రాత్రి వారు గుడుగుంట్లపాలెం గ్రామానికి చేరుకుని రెండు కంటి పొరలను సేకరించారు. కార్నియా అంధత్వంతో బాధపడే ఇద్దరికి వాటిని అందించి కంటి చూపును ప్రసాదించనున్నట్టు ఐ డొనేషన్ సెంటర్ సిబ్బంది తెలిపారు. చైతన్యవంతమైన నిర్ణయం తీసుకుని స్ఫూర్తిగా నిలిచిన బక్కా సోమమ్మ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సోమమ్మకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కూతుళ్లు. గుడుగుంట్లపాలెం గ్రామంలో నేత్రదానం చేసిన మొదటి వ్యక్తి సోమమ్మనే అవడం అభినందనీయం.

మరణం దాటి… మరో ఇద్దరికి కంటి చూపు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

