RS Praveen Kumar | ధారావాహిక సీరియల్లా ఇప్పుడు గురుకుల స్కాం ఎపిసోడ్ 2 నడుస్తోంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో ఉండే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు గత 6 నెలలుగా మేము చెప్తూనే ఉన్నాంమన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
RS Praveen Kumar | ఈ తెలంగాణలో విద్యార్థుల జీవితాలు ఎంత ఘోరమైన ప్రమాదంలో పడ్డాయని చెప్పడం కోసం బీఆర్ఎస్ మీ ముందు ఒక లైవ్ డెమో ఇవ్వాలనుకున్నదని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఒక విద్యార్థి స్కూల్‌కు పోయినప్పుడు గురుకుల పాఠశాల కానీ మామూలు పాఠశాల కానీ పోయినప్పుడు ఆ విద్యార్థి తల్లిదండ్రులు మా బిడ్డ బాగా చదువుకోవాలని మంచి ఆహారం తినాలి.. అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, విటమిన్లు, కొవ్వులు మా బిడ్డకు చక్కగా దొరకాలి.. దొరుకుతాయి అన్మ నమ్మకంతోనే పేదవర్గాలు ఈ బడులకు పంపిస్తారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో ఉండే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు గత 6 నెలలుగా మేము చెప్తూనే ఉన్నాం. రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత, హోంశాఖ మంత్రి అయిన తర్వాత పిల్లల జీవితాలు నిజంగా ప్రమాదంలో పడ్డాయన్నారు.
ఐపీఎల్ సీజన్ 1,2, 3 ఎట్లా అయితే ఉంటదో గురుకుల కుంభకోణం కూడా ఒక ధారావాహిక సీరియల్లా నడుస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇప్పుడు ఎపిసోడ్ 2 నడుస్తోంది.. అదేంటంటే కల్తీ సరుకులు మన పిల్లలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనార్టీ సంక్షేమ, జనరల్ సంక్షేమ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో పొద్దున బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం అన్నం, రాత్రి డిన్నర్ చేసే లక్షలాది మంది పిల్లల తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి.. మీ పిల్లలకు ఇచ్చే ఆహారం కల్తీ ఆహారం ఉండబోతుందని హెచ్చరించారు.
గురుకుల పాఠశాలలకు కల్తీ సరుకులు పంపిణీ చేస్తున్నారు
ఐపీఎల్ సీజన్ 1,2,3 లాగా గురుకుల కుంభకోణం కూడా ఎపిసోడ్ల లాగా బయటపడుతుంది
గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు భోజనం ఈ కల్తీ సామాన్లతోనే వండుతున్నారు
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ pic.twitter.com/csXiuEGmFQ
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026
Read Also ;
Ind vs US | రష్యా చమురు కొనవద్దని అమెరికా అల్టిమేటం.. తీవ్రంగా స్పందించిన భారత్..!
KTR | 25 ఏండ్ల కింద ఇచ్చిన తోట ఆగయ్య భూమిని రేవంత్ రెడ్డి గుంజుకున్నడు : కేటీఆర్
Sircilla| అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

