జెరూసలేం, ఫిబ్రవరి 6: గాజాస్ట్రిప్ను ఖాళీ చేయించి, పాలస్తీనియన్లకు పునరావాసం కల్పించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనపై ఇజ్రాయెల్ కసరత్తు చేస్తున్నది. స్వచ్ఛందంగా గాజాను వీడేవాళ్ల కోసం ఓ ప్రణాళిక రూపొందించాలని ఇజ్రాయెల్ సైన్యానికి ఆ దేశ రక్షణమంత్రి కట్జ్ ఆదేశించారు.
గాజా నివాసితులకు వలస వెళ్లే స్వేచ్ఛను ఇవ్వాలి’ అని కట్జ్ అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యల్ని విమర్శించే స్పెయిన్, ఐర్లాండ్, నార్వే పాలస్తీనియన్లకు ఆశ్రయం ఇవ్వాలని కోరారు.