Ratan Tata | టాటా సంస్థల అధినేత రతన్ టాటా (Ratan Tata) కొన్ని రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే. రతన్ టాటా కేవలం లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మాత్రమే కాకుండా, గొప్ప మానవతావాదిగా, సమాజ సేవకుడిగా పేరుపొందారు. ఆయన మరణానంతరం రూ.వేల కోట్ల ఆస్తిని తాను నెలకొల్పిన ఫౌండేషన్లకు, సోదరుడు జిమ్మీ టాటాతోపాటు తన సహాయకులు, పెంపుడు శునకానికి చెందేలా వీలునామా రాసి తన మంచి మనసు చాటుకున్న విషయం తెలిసిందే.
అయితే వీలునామాలో ఓ రహస్య వ్యక్తి (Mystery Man)కి రూ.వందల కోట్లు ఇవ్వాలంటూ రతన్ టాటా పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వీలునామాలో ఉన్న రహస్య వ్యక్తి పేరు చూసి టాటా కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఆ మిస్టరీ పర్సన్ ఎవరో కాదు దాదాపు ఆరు దశాబ్దాలుగా రతన్ టాటాకు నమ్మకస్తుడిగా సేవలు అందించిన జంషెడ్‌పుర్ (Jamshedpur)కు చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా (Mohini Mohan Dutta) అని తెలిసింది. తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో 2013 నుంచి మోహన్ దత్తాకు చెందిన స్టాలియన్ (Stallion) ట్రావెల్ ఏజెన్సీ కలిసి పనిచేస్తోంది.
అంతేకాదు టాటా కుటుంబానికి మోహన్ దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారని టాటా గ్రూప్‌కు చెందిన అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్లో ముంబైలోని ఎన్సీపీఏలో నిర్వహించిన రతన్ టాటా జన్మదిన వేడుకలకు సైతం దత్తాను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం. మోహన్ దత్తాకు తన ఆస్తిలో రూ.500 కోట్లు ఇవ్వాలని రతన్ టాటా వీలునామాలో పేర్కొన్నట్లు తెలిసింది.
Also Read..
Maha Kumbh Mela | మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం
Plane Missing | అమెరికాలో విమానం మిస్సింగ్.. రంగంలోకి దిగిన అధికారులు
Donald Trump | ట్రంప్ మరో కఠిన నిర్ణయం.. ఆ సంస్థలోని 9,700 మంది ఉద్యోగుల తొలగింపు..!