Plane Missing | అమెరికాలో ఓ విమానం అదృశ్యమైంది (Plane Missing). పది మందితో అలస్కా (Alaska) మీదుగా వెళ్తున్న విమానం రాడార్ సిగ్నల్స్‌కు అందకుండా పోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. విమానం జాడ కనుక్కునేందుకు ప్రయత్నాలు (search operations) ముమ్మరం చేశారు.
బేరింగ్ ఎయిర్ సంస్థ (Bering Air Flight)కు చెందిన సెస్నా 208బీ గ్రాండ్ కారవాన్ ఎయిర్‌క్రాఫ్ట్ (Cessna 208B Grand Caravan aircraft) విమానం గురువారం మధ్యాహ్నం 2:37 గంటల సమయంలో అలస్కా పట్టణం ఉనల్కలేట్ (Unalakleet) నుంచి నోమ్‌కు బయల్దేరింది. ఆ సమయంలో విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులు ఒక పైలట్ ఉన్నారు. అయితే విమానం నార్టోన్ సౌండ్ ప్రాంతంలోకి రాగానే రాడార్ సిగ్నల్స్‌కు అందకుండా పోయింది. విమానం జాడ కనుక్కునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలస్కాలోని ప్రతికూల వాతావరణంగా కారణంగానే విమానం అదృశ్యమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read..
Donald Trump | ట్రంప్ మరో కఠిన నిర్ణయం.. ఆ సంస్థలోని 9,700 మంది ఉద్యోగుల తొలగింపు..!
Congo | కాంగోలో తిరుగుబాటుదారుల అకృత్యాలె.. వందలాది మహిళా ఖైదీలపై రేప్, సజీవ దహనం
Star Links | కూలుతున్న స్టార్‌లింక్స్.. ఎలాన్ మస్క్ కంపెనీతో భారీగా వాతావరణ కాలుష్యం