మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 23:12:20

సెప్టెంబర్ 15 న గరిష్ట స్థాయికి కరోనా

సెప్టెంబర్ 15 న గరిష్ట స్థాయికి కరోనా

న్యూఢిల్లీ : భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వచ్చే సెప్టెంబర్ 15 వ తేదీన గరిష్టంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రజలు మరింత బాధ్యతాయుతమైన వైఖరిని అవలంబించాల్సి ఉంటుంది. దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది గ్రామాల్లో నివసిస్తున్నందున.. ఈ వైరస్ గ్రామాలకు చేరకుండా నిరోధించడమనేది ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద పని. ఈ వైరస్ కొత్త బలంతో పెరుగుతున్నదని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ కే శ్రీనాథ్ రెడ్డి శనివారం వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ప్రొఫెసర్ రమేశ్ రెడ్డి తెలిపారు. . 

లాక్డౌన్ రెండో దశ వరకు కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి లాక్డౌన్ ఖచ్చితంగా జరిగిందని, అయితే మే 3 వ తేదీ తరువాత లాక్డౌన్ సడలించడంతో వ్యాప్తి తీవ్రత పెరిగిందని, లాక్డౌన్ సడలించిన వెంటనే ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా అందరూ స్వేచ్ఛగా తిరగడం వల్ల వ్యాప్తి పెరిగిందని ఆయన చెప్పారు. 

డాక్టర్ రెడ్డి.. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) లో కార్డియాలజీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. ప్రస్తుతం హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో అధ్యయన పనులతో బిజీగా ఉన్నారు.


logo