కాళ్లు, తల లేని వింత జంతువు కాలనీ వాసులను భయపెడుతోందని ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే అలర్టైన పోలీసులు ఆ ఏరియాకి వచ్చారు. చెట్టుపై ఉన్న వింత జంతువుని క్షుణంగా పరిశీలించారు. ఆ తర్వాత ఒక్కసారిగా పగలబడినవ్వారు. ఎందుకు అనుకుంటున్నారా?అది అసలు వింతజంతువే కాదు కాబట్టి. ఈ సంఘటన పోలాండ్ లో జరిగింది.
క్రాకో నగరానికి చెందిన ఓ మహిళ తన ఇంటి సమీపంలోని చెట్టుపై వింత జీవి ఉందని, భయమేస్తోందంటూ పోలీసులకు ఫోన్ చేసింది. పోలీస్ ఆఫీసర్ ఆడమ్ ఆ వింత జంతువు ఎలా ఉందో చెప్పమని మహిళ నుంచి వివరాలు సేకరించారు. అయితే ఆ మహిళ చెప్పిన విధానం అనుమానంగా ఉండటంతో వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లారు. చెట్టుపై వేలాడుతున్న ఆ వింతజీవిని చూశారు. కానీ దానిలో ఎలాంటి కదలిక లేకపోవడాన్ని గుర్తించారు. దగ్గరకు వెళ్లి చూసే సరికి షాకయ్యారు. ఎందుకంటే అది అసలు జంతువే కాదు. ఆ దేశంలో లభించే క్రొసియెంట్ (croissant) అనే ఒక రకమైన బ్రెడ్. పక్షులకు ఆహారం అందివ్వడానికి స్థానికులు ఎవరో దాన్ని చెట్టుపై పెట్టి ఉంటారని భావించారు.