వేములవాడ పుణ్యక్షేత్ర పట్టణంలో రాజన్న ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్న వేళ సమీపంలోని ఓ స్థలం నిషేధిత జాబితాలో ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న మున్సిపల్ అధికారులు అక్రమాలకు తెర లేపారన్న ఆరోపణలు వస్తుండగా, ఇటీవల ఇద్దరికి ప్రధాన రహదారిని ఆనుకొని అనుమతులు మంజూరు చేయడం వాటికి బలం చేకూరుస్తోంది. మొత్తం వ్యవహారాన్ని పాలకవర్గంలోని ఓ ముఖ్య నేత అనుమతుల నుంచి మొదలుకొని నిర్మాణం వరకు తానే బాధ్యత తీసుకొని పెద్ద ఎత్తున చక్రం తిప్పుతున్న తీరుపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.
వేములవాడ, జూలై 9 : వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్టాండ్ సమీపంలో భవన నిర్మాణాలకు అనుమతి లేని నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లలో ఇప్పటికే రెండు నిర్మాణాలకు వేములవాడ పురపాలక సంఘం అధికారులు అనుమతులు జారీ చేశారు. 100 అడుగుల రహదారిని ఆనుకొని ఉన్న 853 సర్వే నెంబర్లో మే నెలలో 244 గజాలలో సిరిసిల్ల పట్టణానికి చెందిన ఒకరికి, జూన్ 23న కూడా మరో 257 గజాలలో చందుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒకరికి నిర్మాణాల కోసం అనుమతులు ఇచ్చారు. అయితే, నిషేధిత జాబితాలో ఉన్న 853 సర్వే నెంబర్లో రెండు నిర్మాణాలకు అనుమతులు జారీ చేయగా, ఇందులో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టుగా ప్రస్తుతం వేములవాడలో చర్చనీయాంశంగా మారింది.
చక్రం తిప్పుతున్న పాలకవర్గ నేత
నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లో వేములవాడ పురపాలక సంఘం పట్టణ ప్రణాళిక అభివృద్ధి విభాగంలో పనిచేసే అధికారి ఒకరు మే నెలలో సిరిసిల్ల పట్టణవాసికి అనుమతిని జారీ చేశారు. అయితే, నిషేధం ఉన్నచోట ఎలా అనుమతి ఇచ్చారన్న విషయం బయటకు రావడంతోపాటు నగదు చేతులు మారాయన్న ఆరోపణలు కార్యాలయంలో పెద్ద రచ్చగా మారినట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించి ఆ విభాగం అధికారిని కాపాడడంతోపాటు మరికొందరికి అనుమతులు ఇచ్చేందుకు పాలకవర్గంలోని ఓ నేత చక్రం తిప్పుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ముందుగా అనుమతి పొందిన సదరు యజమాని నుంచి నిర్మాణపు అనుమతులు దకించుకున్న ఆ నేత.. రెండో నిర్మాణానికి కూడా అనుమతులు ఇప్పించడమే కాకుండా భవన నిర్మాణ హకులను కూడా దకించుకున్నట్లుగా తెలిసింది. నిషేధిత జాబితాలో సర్వే నెంబర్లలో అనుమతులు ఇచ్చిన అధికారులను కాపాడుతూ తన పనిని కూడా చకబెట్టుకుంటున్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి.