IndiGo | విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి రాయ్పూర్ (Raipur) వచ్చిన ఇండిగో (IndiGo) విమానం సమస్య తలెత్తింది. విమానం ల్యాండ్ అయినా డోర్ మాత్రం తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం, పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.
ఇండిగో సంస్థకు చెందిన 6E-6312 విమానం ఢిల్లీ నుంచి రాయ్పూర్ చేరుకుంది. రాయ్పూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. అయితే, ల్యాండింగ్ అనంతరం సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం తలుపు తెరుచుకోకుండా మొరాయించింది. దీంతో దాదాపు 40 నిమిషాల పాటు ప్రయాణికులు, సిబ్బంది అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ (Bhupesh Baghel), ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే చతురి నాద్, మేయర్ మీనాల్ చౌబే ఉన్నారు. ఈ ఘటనతో విమానంలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
F-35 fighter jet | 72 గంటలు గడిచినా ఇంకా కేరళలోనే బ్రిటన్ ఫైటర్ జెట్..!
Air India plane crash | విమాన ప్రమాదం.. డీఎన్ఏ పరీక్ష ద్వారా 184 మృతదేహాలు గుర్తింపు