IndiGo | దేశీయంగా అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసుల్లో వరుసగా ఐదో రోజూ అంతరాయం కొనసాగుతోంది. శనివారం ఉదయం దేశవ్యాప్తంగా దాదాపు 500 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శనివారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 86 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. అందులో 37 వెళ్లాల్సినవికాగా, 49 విమానాలు రావాల్సినవి. ఇక ముంబై ఎయిర్ పోర్టులో 109 విమానాలు రద్దయ్యాయి. అందులో 51 అరైవల్స్, 58 డిపార్చర్స్ ఉన్నాయి. బెంగళూరు ఎయిర్‌పోర్టులో 120 ఫ్లైట్స్ రద్దయ్యాయి. అందులో 63 డిపార్చర్స్ కాగా, 61 అరైవల్స్. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మొత్తం 69 విమానాలు క్యాన్సెల్ అయ్యాయి. అందులో 43 డిపార్చర్స్కాగా, 26 అరైవల్స్ ఉన్నాయి. పూణె ఎయిర్‌పోర్టులో 42, చెన్నైలో 29, లక్నోలో 7, తిరువనంతపురంలో ఆరు, అహ్మదాబాద్‌లో 19 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు చెన్నై, అహ్మదాబాద్, ఇండోర్, జైపూర్ సహా పలు ఎయిర్‌పోర్టుల్లో రద్దీ విపరీతంగా ఉంది. ఇండిగో విమానాల రద్దుతో లాంగ్ క్యూలు దర్శనమిచ్చాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Also Read..
IndiGo | ఢిల్లీ-బెంగళూరు రూ.లక్ష.. ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు
ఇండిగోస!.. లండన్‌కు 25వేలు.. ఢిల్లీకి లక్ష!