దేశంలో 95 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 95 లక్షలు దాటాయి. అయితే గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండగా, కరోనా నుంచి కోలుకున్నావారు కూడా పెరుగుతున్నారు. దేశంలో గత 24 గంటల్లో 35,551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,34,965కు చేరింది. ఇందులో 4,22,943 కేసులు యాక్టివ్గా ఉండగా, మరో 89,73,373 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరో 1,38,648 మంది మరణించారు.
కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 526 మంది కరోనా బాధితులు మృతిచెందారని, 40,726 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కరోనా కేసులు నిన్నటికంటే 3 శాతం తక్కువగా నమోదయ్యాయని తెలిపింది.
దేశవ్యాప్తంగా నిన్నటివరకు 14,35,57,647 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) తెలిపింది. ఇందులో నిన్న ఒకేరోజు 11,11,698 నమూనాలకు పరీక్షలు చేశామని వెల్లడించింది.
తాజావార్తలు
- ‘ఇరిగేషన్'లో కొత్త సర్కిళ్లు
- జోరుగా రోడ్డు విస్తరణ పనులు
- ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైన విద్యార్థినులు అక్సా, మైత్రి
- ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
- మిషన్ భగీరథ పనులు నెలాఖరులోగా పూర్తిచేయాలి
- మొదటి రోజు 175 మందికి వ్యాక్సినేషన్
- నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవితకు వినతి
- గొల్ల కురుమలకు చేయూత
- డ్రోన్ వ్యవసాయం
- విత్తనాలను త్వరగా నాటాలి