Drugs | గుజరాత్ రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దేశంలోకి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు చేసిన ప్రయత్నాలను తీర గస్తీదళం భగ్నం చేసింది. రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.
అరేబియా సముద్రంలో భారత సముద్ర జలాల సరిహద్దు వద్ద గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, భారత తీర గస్తీ దళం ఈనెల 12-13 అర్ధరాత్రి వేళ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఓ బోటు కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో దాని దగ్గరకు వెళ్లాయి. కోస్ట్‌గార్డ్ నౌకను చూడగానే బోటులోని స్మగ్లర్లు తమ వద్ద ఉన్న సరకును సముద్రంలో పడేసి పారిపోయారు.
దీంతో కోస్ట్‌గార్డ్, ఏటీఎస్ సిబ్బంది సముద్రంలోకి దిగి సరకును స్వాధీనం చేసుకున్నారు. అందులో 300 కిలోలకు పైగా నిషేధిత మెథాంఫేటమిన్ ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.1800 కోట్లకుపైనే ఉంటుందని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్న ఆ డ్రగ్స్‌ను యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు అప్పగించినట్లు తీర గస్తీదళం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Indian Coast Guard (ICG), in a joint operation with Gujarat ATS on the night of 12-13 Apr 25, seized 300 Kg narcotics worth Rs 1800 Cr off IMBL near Gujarat coast. On spotting the ICG ship, smugglers dumped contraband & fled across IMBL. Consignment recovered at sea & handed to… pic.twitter.com/FO2AMJndkY
— ANI (@ANI) April 14, 2025
Also Read..
Mehul Choksi | బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్ట్.. భారత్‌కు రప్పిస్తారా..?
BR Ambedkar | రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు ప్రముఖుల నివాళులు
PM Modi | ధరల మోతలో మోదీ నంబర్‌వన్.. గ్యాస్, పెట్రో వాతలో ప్రధాని ప్రపంచ రికార్డు