India Corona | రెండో రోజూ మూడు వేలకుపైనే కొత్త కేసులు.. 15వేల మార్క్‌ను దాటిన యాక్టివ్ కేసులు
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి క్రమంగా కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ మూడు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి.
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి క్రమంగా కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ మూడు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 1,18,694 మందికి కొవిడ్ (Covid-19) నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,095 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం. తాజా కేసులతో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4.47 కోట్లకు (4,47,15,786) చేరింది.
మరోవైపు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 15వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 15,208 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4.41 కోట్ల మంది (4,41,69,711) కోలుకున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కేరళలో (Kerala) ముగ్గురు, గుజరాత్ (Gujarat), గోవా (Goa)లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,867కి చేరింది.
ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో (Positive Cases)0.03 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.78 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 (220,65,99,034) కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry) వెల్లడించింది.
Also Read..
Elon Musk | ట్విట్టర్లో రికార్డు సృష్టించిన మస్క్.. ఒబామాను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి
Manchu Vishnu | మంచు గొడవలో ట్విస్ట్.. ఆ వీడియో నిజం కాదా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

