Elon Musk | ట్విట్టర్లో రికార్డు సృష్టించిన మస్క్.. ఒబామాను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి
Elon Musk | ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ సీఈవో (Twitter CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) రికార్డు సృష్టించారు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ (microblogging site) ట్విట్టర్ (Twitter)లో అత్యధికమంది ఫాలోవర్లు (Followers) కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
Elon Musk | ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ సీఈవో (Twitter CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) రికార్డు సృష్టించారు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ (microblogging site) ట్విట్టర్ (Twitter)లో అత్యధికమంది ఫాలోవర్లు (Followers) కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ట్విట్టర్లో మస్క్‌కు ఏకంగా 133 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రికార్డుతో ఇప్పటి వరకు ట్విట్టర్లో అత్యధికమంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో కొనసాగుతన్న అమెరికా మాజీ అధ్యక్షుడు (former US president) బరాక్ ఒబామాను (Barack Obama) మస్క్ (Musk) అధిగమించారు. మస్క్ రికార్డుతో ఒబామా రెండో స్థానానికి పడిపోయారు. ఒబామాను ప్రస్తుతం 133 మిలియన్ల మంది ట్విట్టర్లో అనుసరిస్తున్నారు.
ట్విట్టర్ (Twitter)లో అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన రికార్డు 2020 నుంచి ఒబామా (Obama) పేరుపైనే ఉంది. ఇప్పుడా రికార్డు మస్క్ సొంతమైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకారం గతేడాది అక్టోబరు 27న మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పుడు ఆయన ఫాలోవర్ల సంఖ్య 110 మిలియన్లుగా ఉంది. అనంతరం ఐదు నెలల్లోనే ఆ సంఖ్య 133 మిలియన్లకు చేరుకోవడం విశేషం. అంటే సగటున రోజుకు లక్షమంది ఫాలోవర్లు వచ్చి చేరుతున్నారు. ప్రస్తుతం ట్విటర్ ప్రొఫైల్స్ (Twitter profiles) సూచించిన ఫాలోవర్స్ ప్రకారం.. ఒబామాకు 1,33,042,819 మంది ఫాలోవర్స్ ఉండగా, మస్క్ ఫాలోవర్స్ సంఖ్య 133,068,709 మందిగా ఉంది.
Also Read..
Donald Trump: ట్రంప్ సరెండర్ అవుతారా? పోర్న్ స్టార్ కేసులో ఏం జరుగుతుంది ?
Indore Step well collapse | గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

