Donald Trump: ట్రంప్ సరెండర్ అవుతారా? పోర్న్ స్టార్ కేసులో ఏం జరుగుతుంది ?
Donald Trump: ట్రంప్ సరెండర్ అవుతారని ఆయన లీగల్ టీమ్ చెబుతోంది. ఒకవేళ నేరం రుజువైతే ఆయనకు నాలుగేళ్ల జైలుశిక్ష పడుతుందని అంచనా వేస్తున్నారు. హష్ మనీ కేసులో ట్రంన్ నేరాభియోగం ఎదుర్కొంటున్నారు.
న్యూయార్క్: హష్ మనీ(Hush Money) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)పై నేరాభియోగాలు నమోదు అయిన విషయం తెలిసిందే. అమెరికా చరిత్రలో మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ కేసు నమోదు కావడం చరిత్రలో ఇదే తొలిసారి. 2016 ఎన్నికలకు ముందు పోర్న్‌స్టార్ స్టార్మీ డానియల్స్(Stormy Daniels)కు ట్రంప్ భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారన్న ఆరోపణలు రుజువయ్యాయి. అయితే ఈ కేసులో ఏప్రిల్ 4వ తేదీన.. న్యూయార్క్ క్రిమినల్ కోర్టులో ట్రంప్ విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ నేరాభియోగం(criminal charges) కోర్టులో రుజువైతే అప్పుడు ట్రంప్‌ను అరెస్టు చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫ్లోరిడాలోని మార్ లాగో ఇంటి నుంచి ఆయన నేరుగా న్యూయార్క్ కోర్టు(newyork court)కు వెళ్లాల్సి వస్తుంది. ముందుగా ఈ కేసులో ఆయన తన ఫింగర్‌ప్రింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ కేసులో ట్రంప్ లీగల్ టీమ్, జిల్లా అటార్నీ ఆఫీసు మధ్య చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. వచ్చే వారం ట్రంప్ కోర్టులో సరెండర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన లీగల్ టీమ్ చెబుతోంది.
కేసు బుక్కైన తర్వాత ఆ కేసుకు జడ్జి ఎవరో అన్న విషయాన్ని తేల్చుతారు. ఆ తర్వాత విచారణ ఎప్పుడు మొదలుపెట్టాలన్న విషయాన్ని కూడా చెబుతారు. బెయిల్ ఇస్తారా అన్న కోణంలో కూడా చర్చలు జరగనున్నాయి. ఒకవేళ నేరం రుజువు కాకపోతే ట్రంప్‌కు కేవలం జరిమానా వేసి వదిలేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేరం రుజువైతే .. ట్రంప్‌కు కనీసం నాలుగేళ్ల జైలు శిక్ష పడే ఛాన్సు ఉంది. కానీ జైలు శిక్ష లేకుండానే కేవలం ఫైన్‌తో ఆ కేసును క్లియర్ చేయవచ్చు అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
న్యూయార్క్ కోర్టులో విచారణ సరైన రీతిలో సాగదని ట్రంప్ అన్నారు. తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఆయన రియాక్ట్ అయ్యారు. ఒక నకిలీ, అవినీతి, అవమానకర ఆరోపణలు తనపై చేసినట్లు ట్రంప్ తెలిపారు. ట్రుత్ సోషల్ మీడియాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ కక్షతో కూడుకున్నదన్నారు.
ఇదీ కేసు..
డోనాల్డ్ ట్రంప్ 2006లో తనతో శృంగారం చేశారని.. పోర్న్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియల్స్ (Stormy Daniels) ఆరోపించిన విషయం తెలిసిందే.ఆ విషయాన్ని బయటపెట్టకూడదంటూ తనను బెదిరించిట్లు ఆమె వెల్లడించారు. 2016 ఎన్నికలకు ముందు, ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ట్రంప్ లాయరు తనకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్మార్టీ డేనియల్స్ చెప్పారు. ఆ తరువాత, ట్రంప్ లీగల్ టీంలోని ఓ న్యాయవాదే డేనియల్స్ ఆరోపణలు నిజమేనంటూ ప్రకటించారు.
ట్రంప్ మాజీ లాయర్ మైఖేల్ కోహెల్ 1,30,000 డాలర్లు డేనియల్స్‌కు ముట్టజెప్పారని, తరువాత ఆ మొత్తాన్ని కోహెన్‌కు ట్రంప్ అందజేశారని న్యాయవాది రూడీ గియూలియానీ చెప్పారు. రికార్డుల్లో ఈ మొత్తాన్ని లీగల్ ఫీజు కింద చెల్లించినట్టు ఉందన్నారు. ఈ కేసులో ఐదేండ్లుగా ట్రంప్‌పై విచారణ కొనసాగుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

