Manchu Vishnu | మంచు గొడవలో ట్విస్ట్.. ఆ వీడియో నిజం కాదా?
Manchu Vishnu-Manchu Manoj | గత కొన్నేళ్ల నుంచి మంచు వారింట్లో విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ ఇటీవలే మనోజ్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. మనోజ్ అనుచరుడు సారథిపై విష్ణు చేయిచేసుకోవడం, దాంతో పాటుగా ఇండ్లలోకి వచ్చి మా వాళ్లను, బంధువులను ఇలా కొడుతుంటారండి.
Manchu Vishnu-Manchu Manoj | గత కొన్నేళ్ల నుంచి మంచు వారింట్లో విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ ఇటీవలే మనోజ్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. మనోజ్ అనుచరుడు సారథిపై విష్ణు చేయిచేసుకోవడం, దాంతో పాటుగా ఇండ్లలోకి వచ్చి మా వాళ్లను, బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇదీ ఇక్కడి పరిస్థితి అంటూ మనోజ్ వీడియోలో చెప్పుకురావడం పెద్ద సంచలనమే రేపింది. దీనిపై అప్పుడే విష్ణు స్పందించి.. ఇవి అన్నదమ్ములు మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మనోజ్ మాత్రం కళ్ల ముందు జరుగుతున్న తప్పులను చూసి చూడనట్టు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే’, ‘క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు’ అంటూ కోట్లను షేర్ చేశాడు.
దాంతో మంచు ఫ్యామిలీలో నిజంగానే తగాదాలున్నాయి. విష్ణుకు, మనోజ్‌కు పడట్లేదు. మనోజ్ రెండో పెళ్లితో గొడవలు మరింత పెరిగాయి అని పలువురు భావించారు. అయితే తాజాగా విష్ణు అందరికీ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ అనుకున్నట్లు వాళ్లేమీ గొడవపడట్లేదని, ఇదంతా ఓ రియాలిటీ షో కోసం చేస్తున్న ప్రాంక్ వీడియో విష్ణు ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీనికి హౌజ్ ఆఫ్ మంచూస్ అని పేరును కూడా పెట్టారు. ఈ రియాలిటీ షోను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించాడు. అయితే దీనిపై పలువురు నెటీజన్లు మాత్రం గొడవ వీడియో వైరల్ అవడంతో కవర్ డ్రైవ్ చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
𝚃𝚑𝚒𝚜 𝚒𝚜 𝚓𝚞𝚜𝚝 𝚝𝚑𝚎 𝙱𝚎𝚐𝚒𝚗𝚗𝚒𝚗𝚐!❤️https://t.co/xVJsrrpLIK#HOM #HouseOfManchus
— Vishnu Manchu (@iVishnuManchu) March 30, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

