శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 08, 2021 , 10:16:37

దేశంలో కొత్తగా 18 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 18 వేల కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 20 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇవాళ 18 వేలు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య కోటీ 4 లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 18,139 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, మరో 234 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,04,13,417కు చేరింది. ఇందులో 2,25,449 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 1,50,570 మంది కరోనాతో మృతిచెందారు. మొత్తం కరోనా బాధితుల్లో 1,00,37,398 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని, ఇందులో నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 20,539 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 


logo