‘ఏమయ్యిందే గుండెకూ.. ఏనాడు లేదే ఇంత ఉలుకు..’ అంటూ ప్రియురాలిని తలచుకొని తన్మయంలో మునిగి తేలుతున్నాడు యువహీరో గల్లా అశోక్. తాను నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’లోని పాట ఇది. తొలి చిత్రం ‘హీరో’లో తన ఎనర్జీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన గల్లా అశోక్, మరింత హ్యాండ్సమ్గా మారి ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇందులో కథానాయిక వారణాసి మానస. అర్జున్ జంధ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత.
ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మేకర్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ‘ఏమయ్యిందే గుండెకూ..’ పాట ప్రోమోను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో ఆకట్టుకునే ట్యూన్‌తో ఈ పాటను స్వరపరిచారని, హీరోకు హీరోయిన్‌పై ఉండే ఆరాధానను వ్యక్తం చేసేలా ఈ పాట సాగుతుందని, ఈ పాటలో గల్లా అశోక్ అనందంగా కనిపిస్తుంటే, వారణాసి మానస అందంగా కనిపిస్తున్నదనీ, పూర్తి పాటను మే 3న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల.