శనివారం 23 జనవరి 2021
National - Dec 23, 2020 , 20:55:44

పెద్ద పెట్టుబడులను భారత్‌ ఆకర్షిస్తుంది: ధర్మేంద్ర ప్రధాన్

పెద్ద పెట్టుబడులను భారత్‌ ఆకర్షిస్తుంది: ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ: పెద్ద పెట్టుబడులను భారత్‌ ఆకర్షిస్తుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ‘భారత్‌లో శక్తి యెక్క భవిష్యత్తు’ అనే అంశంపై బుధవారం మాట్లాడారు. పెద్ద పెట్టుబడులను ఆకర్షించే సత్తా మన దేశానికి ఉన్నదని ఈ సందర్భంగా చెప్పారు. చమురు, గ్యాస్ రంగంలోని అన్ని పీఎస్‌యులు విస్తరిస్తున్నాయని అన్నారు. విద్యుత్ రంగంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయని తెలిపారు. ఇంధన భద్రత, పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు, ఆర్థికంగా పోటీ, తక్కువ కార్బన్ ఇంధన పరిష్కారాలను సాధించడానికి విద్యుత్, పునరుత్పాదక, జీవ ఇంధనాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో ప్రయత్నాలు చేస్తున్నామని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo