INDIA bloc meet | ఇండియా కూటమిలో విభేదాలు..! రేపు ఢిల్లీలో జరగాల్సిన మీటింగ్ వాయిదా
INDIA bloc meet | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ (INDIA) కూటమిలో విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది.
INDIA bloc meet | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ (INDIA) కూటమిలో విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. కూటమి తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కాంగ్రెస్ (Congress) పార్టీ రేపు (డిసెంబర్ 6న) సమావేశానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఆ మీటింగ్ వాయిదా పడింది ( postponed ). ఈ సమావేశానికి కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు డుమ్మా కొట్టే యోచనలో ఉన్నట్టు ( top leaders decide to skip) వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మీటింగ్ వాయిదా పడటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
కాగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూటమి తదుపరి కార్యాచరణపై చర్చిచేందుకు కాంగ్రెస్ పార్టీ సమావేశానికి పిలుపునిచ్చింది. డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఆ మీటింగ్ గురించి తనకు తెలియదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.
దీదీ బాటలోనే మిగితా కూటమి నేతలు కూడా ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ఇండియా కూటమి భేటీకి డుమ్మా కొట్టనున్నారు. ఆ ఇద్దరూ తమ ప్రతినిధుల్ని భేటీకి పంపనున్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగే ఇండియా బ్లాక్ భేటీకి వెళ్లే ఆలోచనలో అఖిలేశ్ లేరని ఆ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీలో జరగాల్సిన కూటమి సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Also Read..
Actor Vishal | మీలా మేం సురక్షితంగా లేం.. విశాల్ అసహనం
Byjus | ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు.. ఇంటిని తాకట్టు పెట్టిన బైజూస్ ఫౌండర్!
ISRO | ఇస్రో మరో ఘనత.. చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

