Arvind Kejriwal : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ (Polling) తేదీ దగ్గర పడటంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ప్రతిపక్ష బీజేపీ (BJP) నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఆప్ 11 ఏళ్ల పాలనలో ఢిల్లీకి చేసిందేమీ లేదని, కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయని బీజేపీ మండిపడింది. బీజేపీ ఆరోపణలకు ఆప్ కన్వీనర్ (AAP convenor) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కౌంటర్ ఇచ్చారు.
ఢిల్లీలో యమునా నది నీరు విషపూరితం కావడానికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని కేజ్రీవాల్ ఆరోపించారు. వ్యర్థ రసాయనాలు, ఇతర వ్యర్థాలను నదిలోకి వదలడంవల్లే యమునా నీరు విషతుల్యం అయ్యిందని అన్నారు. కాదంటే బీజేపీ నేతలు యమునా నది నీటిని తాగి చూపించాలని సవాల్ విసిరారు. కేజ్రీవాల్ సవాల్‌ను స్వీకరించిన హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ యమునా నీటిని రుచి చూశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోదీ కూడా కేజ్రీవాల్ ఆరోపణలను తిప్పికొట్టారు.
ప్రధాన మంత్రి తాగే నీళ్లలో ఎవరైనా విషం కలుపుతారా..? అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ అబద్ధాలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశంలోని 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నదని, వాటిలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్ సదుపాయం లేదని విమర్శించారు. దేశంలో 24 గంటల విద్యుత్ సదుపాయం ఉన్నది కేవలం ఢిల్లీలో మాత్రమేనని అన్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున బీజేపీని గెలిపిస్తే ఢిల్లీలో కరెంటు ఖతమేనని కేజ్రీవాల్ హెచ్చరించారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఆప్‌కు కాకుండా రాంగ్ బటన్ నొక్కారంటే అందరూ ఇన్వర్టర్లు, జనరేటర్లు కొనుగోలు చేయాల్సి వస్తుందని అన్నారు. దేశంలో ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేస్తున్నది ఒక్క ఢిల్లీలో మాత్రమేనని చెప్పారు. ఢిల్లీ సంపూర్ణ అభివృద్ధి కోసం ప్రజలు మరోసారి ఆప్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు.
Maha Kumbh Stampede | బారీకేడ్లను తొలగించడంవల్లే తొక్కిసలాట : మహా కుంభమేళా డీఐజీ
Drinking water | ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు అడ్డంకి..!
Road accident | సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారత పౌరులు దుర్మరణం
PM Modi | ‘ఫిబ్రవరి 5న ఆప్ పోతుంది.. బీజేపీ వస్తుంది’.. ఢిల్లీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం