Sanjay Raut : కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) పై ఉద్ధవ్ థాకరే (Uddav Thackeray) వర్గం శివసేన పార్టీ (Shiv Sena) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం బతికే ఉంటే మహారాష్ట్ర (Maharastra) ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అడిగిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పదు చెప్పలేదని, ఎందుకంటే అది మహారాష్ట్రలో అధికార పార్టీకి బానిసగా మారిందని విమర్శించారు.
‘ఒకవేళ భారతదేశ ఎన్నికల సంఘం బతికి ఉంటే రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు కచ్చితంగా సమాధానం చెప్పాలి. కానీ, ఎన్నికల సంఘం సమాధానం చెప్పదు. ఎందుకంటే అది మహారాష్ట్రలో కొలువుదీరిన ప్రభుత్వానికి బానిసగా మారింది’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఓటర్ల జాబితాల్లోకి అదనంగా 39 లక్షల మంది ఓటర్లు ఎలా వచ్చారని రౌత్ ప్రశ్నించారు. బీజేపీ సృష్టించిన ఈ 39 లక్షల మంది ఓటర్లు ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తారని అన్నారు.
వాళ్లు రేపు బీహార్‌లో ఎన్నికలుంటే బీహార్‌కు వెళ్తారని సంజయ్ రౌత్ చెప్పారు. వారిలో కొందరి పేర్లను ఢిల్లీ ఓటర్ల జాబితాలో కూడా చూసినట్లు ఆయన తెలిపారు. వాళ్లు తర్వాత బీహార్‌కు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌కు కూడా వెళ్తారని విమర్శించారు. మహారాష్ట్రలో కేవలం ఐదు నెలల్లో కొత్తగా 39 లక్షల మంది ఓటర్లు చేరడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ, ఉద్ధవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్, శరద్ పవార్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ముందుగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఓటర్ల జాబితాల్లో అక్రమాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత సంజయ్ రౌత్, సుప్రియా సూలే కూడా ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టారు.
KTR | రాష్ర్టాల హక్కులు కాలరాయొద్దు.. యూజీసీ నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: కేటీఆర్
Bodhan | నేనే డాన్ అంటూ రౌడీ షీటర్ వీరంగం.. దేహశుద్ధి చేసిన జనం
Road accident | వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు