Animals | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence).. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇప్పుడు ఇది సర్వాంతర్యామి అయిపోయింది. ఏఐ ద్వారా వింతలు వినోదాలు సృష్టిస్తున్నారు. 20 ఏళ్ల వయసు వారిని 80 ఏళ్ల వృద్ధులుగా, క్రికెటర్లను పండ్లు అమ్ముకునే వాళ్లుగా, బిలియనీర్లను మురికివాడల్లో నివసించేవాళ్లుగా.. ఇలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా సృష్టించిన సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ సారి జంతువులు (Animals), పక్షులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించారు (Animals could walk like human). ఓ బీచ్ వద్ద ఆవు, ఏనుగు, సింహం, జిరాఫీ, జీబ్రా, పాము, ఖడ్గమృగం వంటి జంతువులు రెండు కాళ్లతో నడుస్తున్నట్లు వీడియోని సృష్టించారు. ప్రస్తుతం ఈ ఏఐ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆశ్చర్యకరమైన ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.
If Animals could walk like human 😍 pic.twitter.com/lL9vSI5ZPq
— Shah Rukh Khan (@imsrkmp) February 13, 2025
Also Read..
Alcohol Consumers | మద్యం సేవించే మహిళలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువట.. ప్రభుత్వ సర్వేలో వెల్లడి
Maha Kumbh | మహా కుంభమేళా గడువు పొడిగించండి: అఖిలేష్ యాదవ్
Mood of The Nation Survey | ఇండియా కూటమి కొనసాగాలి.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి