Mood of The Nation Survey : వరుసగా మూడు పర్యాయాలు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని, దాదాపు 11 ఏళ్లుగా దేశాన్ని అప్రతిహతంగా పాలిస్తున్న ఎన్డీఏ (NDA) ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి దేశంలోని పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చాయి. తమిళనాడు (Tamil Nadu) నుంచి ఢిల్లీ వరకు వివిధ రాజకీయ పార్టీలు ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (INDIA)’ పేరుతో అన్ని పార్టీ జట్టు కట్టాయి. ఈ పార్టీలన్నీ కలిసి 2024లో ఎన్డీఏకు వ్యతిరేకంగా బరిలోకి దిగినా విజయం మాత్రం సాధ్యం కాలేదు. అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను సాధించాయి.
ఇండియా కూటమిలోని వివిధ పార్టీల మధ్య లుకలుకలు ఉన్నా ఎన్డీఏను నిలువరించడానికి కలిసి కట్టుగా పనిచేశాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో అనుకున్న ఫలితం రాకపోవడంతో ఆ తర్వాత కూటమిలోని పార్టీలన్నీ ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగి బీజేపీ లాభపడేలా వ్యవహరిస్తున్నాయి. దాంతో ఇండియా కూటిమి ఉంటుందా.. చెల్లాచెదురు అవుతుందా..? అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇండియాటుడే-సీ ఓటర్ సంయుక్తంగా ‘మూడ్ ఆఫ్ ది నేషన్“ సర్వేను నిర్వహించాయి.
ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 మధ్య 1,25,123 మంది ఓటర్లను ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిలోనే కొనసాగాలని సూచించారు. 26 శాతం మంది ఆ అలయెన్స్ అనవసరం అని భావించారు. ఇక ఈ కూటమికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వం వహించాలని అత్యధికంగా 24 శాతం మంది అభిప్రాయపడ్డారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకురాలిగా ఉండాలని 14 శాతం మంది చెప్పారు.
ఆ తర్వాత స్థానాల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ (9 శాతం), సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (6 శాతం) ఉన్నారు. కేజ్రీవాల్ ఇండియా కూటమికి నాయకత్వం వహించాలని 9 శాతం మంది, అఖిలేష్ యాదవ్ నాయకత్వం వహించాలని 6 శాతం మంది కోరుకుంటున్నారు. ఇదిలావుంటే తాజా సర్వే ప్రకారం.. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 343 సీట్లు (2024 ఎన్నికల్లో 292) వస్తాయని, ఇండియా కూటమికి 188 సీట్లు (2024 ఎన్నికల్లో 232 సీట్లు) వస్తాయని అంచనాలు వెల్లడయ్యాయి.
High Court | భార్య వేరొకరిని ప్రేమించడం నేరం కాదు.. అది లేనపుడు వివాహేతర సంబంధం కాదు: హైకోర్టు
Husband Dies Of Illness, Wife Hangs Self | అనారోగ్యంతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
Marco Ebben: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్ కాల్చివేత
Elon Musk | నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్.. రచయిత్రి సంచలన పోస్ట్