Om Birla | పార్లమెంట్ (Parliament) సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులవుతున్నా.. ఎలాంటి చర్చలూ జరగడం లేదు. ఉభయసభల్లో నిత్యం వాయిదాల పర్వం (adjournments) కొనసాగుతోంది. ఎలాంటి చర్చలూ జరగకుండానే ఉభయ సభలు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. అయితే, మంగళవారం మాత్రం సభా కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నప్పటికీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సభ్యులకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) కీలక హెచ్చరికలు చేశారు. వాయిదాల కారణంగా సభా కార్యకలాపాలకు మరింత అంతరాయం కలిగితే.. వారాంతాల్లోనూ సభను సమావేశపర్చాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి (Parliament Winter Session) నుంచి ఉభయ సభల్లోనూ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో లోక్సభలో, రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు సోమవారం ఓ అంగీకారానికి వచ్చాయి. డిసెంబర్ 13, 14 తేదీల్లో దిగువ సభలో, డిసెంబర్ 16, 17 తేదీల్లో ఎగువ సభలో రాజ్యాంగంపై చర్చ ఉంటుంది.
Also Read..
Samajwadi Party: నిన్న తృణమూల్, ఇవాళ సమాజ్వాదీ పార్టీ.. కాంగ్రెస్ నిరసనకు దూరం
Medical Students | ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
Engineering Seat Blocking Scam: ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపుల్లో స్కామ్.. 8 మంది అరెస్టు