Nitin Gadkari | దేశంలో అత్యంత కాలుష్య (Delhi pollution) నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ (Delhi) మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఏటా కాలుష్య స్థాయిలు ప్రమాదకరస్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆందోళన వ్యక్తం చేశారు. తాను రాజధాని నగరంలో రెండు లేదా మూడు రోజులకంటే ఎక్కువ ఉండలేనని అన్నారు. ఢిల్లీకి వస్తే.. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనే ఉంటుందని వ్యాఖ్యానించారు.
‘ఏక్ పెడ్ మా కే నామ్ 2.0’ పేరుతో నిర్వహించిన మొక్కల పెంపకం కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘నేను ఢిల్లీలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఉండగలను. అంతకుమించి ఉండటం నావల్ల కాదు. ఢిల్లీలో అడుగుపెట్టగానే ఎప్పుడు వెళ్లిపోదామా అనే ఉంటుంది. అందుకే నేను వచ్చేటప్పుడే రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటాను. ప్రజలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఢిల్లీలో కాలుష్యం కారణంగా సాధారణ ప్రజల ఆయుర్దాయం తగ్గింది. వాహనాలకు వినియోగించే శిలాజ ఇంధనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడం ప్రజలందరి ప్రధాన బాధ్యత’ అని అన్నారు.
కాగా, ఈ ఏడాది మార్చిలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) నివేదిక ప్రకారం.. శ రాజధాని ఢిల్లీ నగరం మరోసారి మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా నిలిచింది. 2024-25 శీతాకాలంలో (అక్టోబర్ నుంచి జనవరి 31 వరకు) ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 715 మైక్రోగ్రాములుగా రికార్డయ్యింది. ఇది ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే చాలా ఎక్కువగా. దీంతో ఢిల్లీతో పాటు ఇతర మెట్రో నగరాల్లో కాలుష్యం తగ్గించడంపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మొదట వాహనాల కాలుష్యాన్ని నియంత్రించాలని.. ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలని.. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. పర్యావరణ అనుకూల పరిశ్రమలను స్థాపించేలా చూడాలని చెబుతున్నారు. కర్మాగాల నుంచి వచ్చే పొగపై కఠినమైన నియంత్రణ అవసరమని.. చెత్తను కాల్చడంపై నిషేధం విధించాలని చెబుతున్నారు. వాస్తవానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున చెత్తను కాల్చివేస్తున్న విషయం తెలిసిందే. మొక్కలను నాటడం.. నగరాల్లో పచ్చదనం పెంపుపై దృష్టి సారించడం అవసరమని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.
Also Read..
Bridge Collapses | కూలిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు.. ముగ్గురు మృతి.. VIDEO
Road Washed | భారీ వర్షాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రోడ్డు
MLA Sanjay Gaikwad: క్యాంటీన్ ఆపరేటర్‌ను కొట్టిన శివసేన ఎమ్మెల్యే… వీడియో