Road Washed | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదలకు ఎక్కడికక్కడ రహదారులు, బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి. తాజాగా రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లో భారీ వర్షాలకు నూతనంగా నిర్మించిన ఓ రోడ్డు కొట్టుకుపోయింది (Road Washed).
రాష్ట్రంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో ఝుంఝును (Jhunjhunu) జిల్లాలోని ఉదయపూర్వతిలో గల బఘలి అనే ప్రాంతంలో కట్లి నది (Katli River) ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతికి జిల్లాలో నూతనంగా నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రోడ్డు ఒక్కసారిగా కొట్టుకుపోయింది. బాఘలి-జహాజ్, ఝుంఝును-సికార్లకు కలిపే జాతీయ రహదారి 52తో అనుసంధానిస్తూ ఆరు నెలల క్రితమే ఈ రోడ్డును నిర్మించారు. ఇంకా ఇది ప్రారంభోత్సవానికి కూడా నోచుకోలేదు. ఇంతలోనే వరదలకు కొట్టుకుపోవడంతో నిర్మాణాల నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
The road was planned to be Inaguarated in just within a week.
But couldn’t sustain single rain, thats the power of Corruption, loot & plunder.
This is Double engine govt of Rajasthan under failed Modi.
Corruption is legalised now as Commission.pic.twitter.com/DBkQakuUm0
— Manu🇮🇳🇮🇳 (@mshahi0024) July 9, 2025
Also Read..
Bridge Collapses | కూలిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు.. ముగ్గురు మృతి.. VIDEO
MLA Sanjay Gaikwad: క్యాంటీన్ ఆపరేటర్‌ను కొట్టిన శివసేన ఎమ్మెల్యే… వీడియో
FSSAI Warn | ఈ-కామర్స్ సంస్థలకు FSSAI కీలక హెచ్చరికలు..!