MLA Sanjay Gaikwad: క్యాంటీన్ ఆపరేటర్‌ను కొట్టిన శివసేన ఎమ్మెల్యే… వీడియో
MLA Sanjay Gaikwad: పులిసిన పప్పు సర్వ్ చేసిన క్యాంటీన్ ఆపరేటర్‌పై.. షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అటాక్ చేశారు. ఈ ఘటన చర్చిగేట్ వద్ద ఉన్న ఎమ్మెల్యే క్యాంటీన్లో చోటుచేసుకున్నది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది.
ముంబై: మహారాష్ట్రలో షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్(MLA Sanjay Gaikwad) .. క్యాంటీన్ ఆపరేటర్‌పై చేయి చేసుకున్నాడు. అతనికి ఇచ్చిన పప్పు క్వాలిటీ లేకపోవడంతో ఆవేశానికి లోనయ్యాడు. ఎమ్మెల్యే గైక్వాడ్ విసిరిన పంచ్‌లకు క్యాంటీన్ ఆపరేటర్ కింద పడిపోయాడు. చర్చ్‌గేట్ వద్ద ఉన్న ఆకాశవాణి ఎమ్మెల్యే క్యాంటీన్లో ఈ ఘటన జరిగింది. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. తన చర్య పట్ల క్షమాపణ చెప్పేది లేదని, ఇది శివ సేన స్టయిల్ అంటూ ఆ ఎమ్మెల్యే అన్నట్లు తెలుస్తోంది.
బుల్దానా నియోజకవర్గానికి చెందిన సంజయ్ గైక్వాడ్.. దాల్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ వచ్చిన తర్వాత తినే టైంలో ఆ పప్పు పులిసినట్లు గుర్తించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ఎమ్మెల్యే.. ఆ ఆవేశంలోనే క్యాంటీన్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. ఈ పప్పును ఎవరు తయారు చేశారని నిలదీశాడు. ఆ పప్పు వాసన చూడాలని అందర్నీ పిలిచాడు. కొంత పప్పు తిన్నానని, అది కడుపులోకి వెళ్లగానే కడుపు వికారంగా మారిందన్నారు.
At the MLA residence canteen Mumbai, PM Narendra Modi’s most favourite and trustworthy MLA, Sanjay Gaikwad (SS Shinde), was seen assaulting a poor staffer over bad food. But since he’s from a BJP ally, the media won’t highlight it or call it hooliganism pic.twitter.com/JTYPvFYaRr
— Pritesh Shah (@priteshshah_) July 9, 2025
దాల్‌ను ఎవరు సర్వ్చేశారు. దీన్ని ప్యాక్ చేసి ఫుడ్ డిపార్ట్మెంట్కు పంపండి అంటూ ఎమ్మెల్యే ఆగ్రహించాడు. ఎమ్మెల్యేకే ఇలాంటి పప్పు పెడుతున్నారంటే సాధారణ కస్టమర్ల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. గొడవ జరుగుతున్న సమయంలో క్యాంటీన్ ఆపరేటర్ అక్కడ లేరు. మళ్లీ రిసెప్షన్ వద్దకు వెళ్లాడు ఎమ్మెల్యే. నడుం చుట్టు టవల్ కట్టుకుని, బినియన్ మీదే వచ్చిన అతను సిబ్బందిపై ఊగిపోయాడు. కాసేపటికి క్యాంటీన్ ఆపరేటర్ అక్కడకు వచ్చాడు. అతని పప్పు ఇచ్చి స్మెల్ చూడమన్నాడు. ఇంతలోనే అతని ముఖంపై ఎమ్మెల్యే పంచ్ విసిరాడు. అదే ఊపులో మళ్లీ రెండు పంచ్‌లు ఇచ్చాడు. దీంతో ఆ క్యాంటీన్ ఆపరేటర్ కింద పడిపోయాడు.
ఎమ్మెల్యేను మాత్రమే కాదు, తానో యోధుడినని చెప్పాడు. ఎన్ని సార్లు చెప్పినా విననివారికి.. బాబాసాహెబ్ థాకరే బాషలో చెప్పాల్సి వచ్చిందన్నారు. జూడో, జిమ్నాస్టిక్స్, కరాటే, రెజ్లింగ్‌లో చాంపియన్‌ను అని, తానేమీ గాంధేయవాదిని కాదన్నారు. తన చర్య పట్ల తానేమీ చింతించడంలేదన్నారు. ఏమీ తప్పు చేయలేదని, అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని లేవనెత్తనున్నట్లు ఎమ్మెల్యే గైక్వాడ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

