Bridge Collapses | గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వడోదర (Vadodara) జిల్లాలోని మహిసాగర్ నది (Mahisagar river)పై ఉన్న గంభీర్ వంతెన (Gambhira bridge) బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Bridge Collapses). ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణాలు సాగిస్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 10 మందిని రక్షించారు. చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ వంతెన 45 ఏళ్ల కిందట నిర్మించిందిగా అధికారులు తెలిపారు. చాలా కాలంగా ఇది శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
#WATCH | Vadodara, Gujarat | The Gambhira bridge on the Mahisagar river, connecting Vadodara and Anand, collapses in Padra; local administration present at the spot. pic.twitter.com/7JlI2PQJJk
— ANI (@ANI) July 9, 2025
Also Read..
MLA Sanjay Gaikwad: క్యాంటీన్ ఆపరేటర్‌ను కొట్టిన శివసేన ఎమ్మెల్యే… వీడియో
FSSAI Warn | ఈ-కామర్స్ సంస్థలకు FSSAI కీలక హెచ్చరికలు..!
Alia Bhatt: 77 లక్షలు చీటింగ్.. ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ అరెస్టు