Bomb Threat | అమిత్ షా నియంత్రణలోని కేంద్ర హోంశాఖకు బాంబు బెదిరింపులు
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖకే (Home Ministry) బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. పాఠశాలలు, విమానాశ్రయాలు, పలు సంస్థలకు ఇటీవలే వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంశాఖకే (Home Ministry) బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
అమిత్‌షా (Amit Shah) నియంత్రణలోని హోంశాఖను (Ministry Of Home Affairs) పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఈమెయిల్ చేసినట్లు మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వెంటనే నార్త్ బ్లాక్‌లోని రెడ్ స్టోన్ బిల్డింగ్ వద్దకు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. బాంబ్ స్వ్కాడ్, జాగిలాల సాయంతో బిల్డింగ్ మొత్తం తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ, పేలుడు పదార్థాలూ దొరకలేదు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈమెయిల్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read..
Election body | నేతల ఎన్నికల ప్రచారాలపై ఈసీ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్‌కు నోటీసులు
Atishi | ఎలక్టోరల్ బాండ్ల స్కామ్.. జూన్ 4 తర్వాత బీజేపీ నేతలు జైలుకే : ఢిల్లీ మంత్రి అతిశీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

