Swati Maliwal | నా వ్యక్తిగత ఫొటోలు లీక్ చేసేందుకు కుట్రలు.. సొంత పార్టీపై స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు
Swati Maliwal | సొంతపార్టీపై (AAP) ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal) సంచలన ఆరోపణలు చేశారు.
Swati Maliwal | సొంతపార్టీపై (AAP) ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal) సంచలన ఆరోపణలు చేశారు. కొందరు ఆప్ నేతలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత ఫొటోలు లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘ఆప్ సీనియర్ నేత నుంచి నిన్న నాకు కాల్ వచ్చింది. నాపై అభ్యంతరకర ఆరోపణలు చేయాలంటూ పార్టీలోని ప్రతి ఒక్కరిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. నా వ్యక్తిగత ఫొటోలను లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తెలిపారు. నాకు మద్దతుగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారట. అంతేకాదు నాకు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించే బాధ్యతలు కొందరికి, సోషల్ మీడియాలో ట్వీట్లు చేసే బాధ్యత మరికొందరికి అప్పగించారట. నిందితులకు సన్నిహితంగా ఉన్న కొందరు రిపోర్టర్లను కొట్టి నాపై నకిలీ స్టింగ్ ఆపరేషన్లు చేయించాలని చేస్తున్నారు’ అని స్వాతి మలివాల్ తన ట్వీట్లో ఆరోపించారు. వేల మంది సైన్యాన్ని దింపినా తాను ఒంటరిగా ఎదుర్కొంటానని ఈ సందర్భంగా స్వాతి అన్నారు. నిజం తనవైపే ఉందన్నారు. తన ఆత్మగౌరవం కోసం పోరాటం ప్రారంభించానని.. న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
కాగా, స్వాతి మలివాల్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ (Bibhav Kumar) దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈనెల 13న సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూమ్‌లో బిభవ్ తనపై దాడి చేశాడని స్వాతి ఆరోపిస్తోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిభవ్‌ను అరెస్ట్ చేశారు. అదేవిధంగా సీఎం నివాసం నుంచి నిందితుడి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సీసీటీవీ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
Also Read..
Manisha Koirala | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ని కలిసిన మనీషా కోయిరాల.. ఫొటోలు షేర్ చేసిన నటి
Schengen Visa | షెన్జెన్ వీసా ఫీజు 12 శాతం పెంపు.. భారతీయులపై తీవ్ర ప్రభావం
Virat Kohli | విరాట్ భద్రతకు ముప్పు..! ప్రాక్టీస్‌ను రద్దు చేసుకున్న ఆర్సీబీ..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

