Virat Kohli | విరాట్ భద్రతకు ముప్పు..! ప్రాక్టీస్‌ను రద్దు చేసుకున్న ఆర్సీబీ..!
Virat Kohli | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో కీలక ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనున్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడబోతున్నది. గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు ఈ మ్యాచ్ జరుగనున్నది.
Virat Kohli | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో కీలక ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనున్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడబోతున్నది. గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు ఈ మ్యాచ్ జరుగనున్నది. మ్యాచ్‌కు ముందు మంగళవారం బెంగళూరు జట్టు ప్రాక్టీస్‌కు దూరమైంది. ప్రాస్టీస్ సెషన్ రద్దు చేసుకోవడంతో పాటు మీడియా సమావేశం సైతం జరుగులేదు. దీని వెనుక భద్రతా కారణాలు కారణమని వెలుగులోకి వచ్చింది.
బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీకి బెదిరింపులు వచ్చాయంటూ ఓ మీడియా నివేదిక సంచలన విషయం బయటపెట్టింది. సమాచారం ప్రకారం.. గుజరాత్ పోలీసులు సోమవారం రాత్రి అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వారి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు వీడియోలు, సందేశాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై బెంగళూరు, రాజస్థాన్ జట్లకు పోలీసులుకు సమాచారం అందించారు. విరాట్ కోహ్లీ భద్రత దృష్టిలో పెట్టుకొని బెంగళూరు ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకుందని మీడియా నివేదిక పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు రెండు జట్లు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.
పోలీస్ అధికారి విజయ్ సింగ్ జ్వాలా మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత అరెస్టుల గురించి తెలిసిందని.. అతని భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. ఆర్సీబీ రిస్క్ తీసుకోదలచుకోలేదని.. తమకు ప్రాక్టీస్ సెషన్ ఉండదని తెలియజేసినట్లుగా చెప్పారు. రాజస్థాన్ రాయల్స్‌కు సైతం సమాచారం అందించినట్లు చెప్పారు. అయితే, ప్రాక్టీస్‌కు వెళ్లడంలో ఎలాంటి సమస్య లేదని, అయితే రాజస్థాన్ ప్రాక్టీస్‌లో పాల్గొనట్లుగా విజయ్ సింగ్ జ్వాలా వివరించినట్లు మీడియా నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇవాళ జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ, రాజస్థాన్ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన ఇంటిముఖం పడుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

