Supreme Court | జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 (Article 370) రద్దు అంశంపై సుప్రీం కోర్టు (Supreme Court) నేడు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన లక్షణాల్లో ఒకటని, వాటిని నిలుపుదల చేయలేమని ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. ‘2024 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’ అని సుప్రీం కోర్టు తెలిపింది. ఇక ఇదే సందర్భంగా వీలైనంత త్వరగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
Also Read..
Article 370 | ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
Amazon | ఆన్లైన్ ద్వారా సోనీ హెడ్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే.. టూత్‌పేస్ట్ వచ్చింది..!
Bus Tickets | ఇకపై వాట్సాప్ ద్వారా బస్ టికెట్లు.. ఢిల్లీ సర్కార్ యోచన