Amazon | ఆన్లైన్ షాపింగ్ (Online Shopping) గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. తమకు కావల్సిన వస్తువులను ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే, కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన ఉత్పత్తులు మిస్ప్లేస్మెంట్లు జరుగుతుంటాయి. ఒకటి ఆర్డర్ పెడితే దానికి బదులుగా మరో వస్తువు డెలివరీ అవుతుంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. ఫోన్లు ఆర్డర్ చేస్తే బిస్కెట్లు, స్టోన్స్ (రాళ్లు) వంటివి పార్శిల్స్‌లో వచ్చిన ఘటనలను ఇప్పటికే వెలుగుచూశాయి. తాజాగా ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఖరీదైన సోనీ హెడ్‌ఫోన్స్ (Sony Headphones) ఆర్డర్ చేస్తే.. దానికి బదులు కోల్గేట్ టూత్‌పేస్ట్ డెలివరీ అయ్యింది. ఈ ఘటనతో కంగుతిన్న అతడు తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
ఓజాహ్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఓ వీడియో షేర్ చేశాడు. ‘సోనీ XB910N వైర్లెస్ హెడ్ఫోన్లను అమెజాన్ ద్వారా రూ. 19,900కి ఆర్డర్ చేశాను. కానీ దానికి బదులుగా కోల్గేట్ టూత్‌పేస్ట్ (Colgate Toothpaste)ను అందుకున్నాను’ అంటూ అమెజాన్ డెలివరీని అన్బాక్సింగ్ చేసే వీడియోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై అమెజాన్ సంస్థ కూడా స్పందించింది. ఘటనకు గానూ అతడికి క్షమాపణలు చెప్పింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు అందుకు అవసరమైన వివరాలను అందించాలని కోరింది.
Well I ordered sony xb910n and got Colgate lmafao. pic.twitter.com/GpsiLWemwl
— Yash ojha (@Yashuish) December 8, 2023
కాగా, ఇటీవలే ఆర్యన్ అనే ఓ కస్టమర్ రూ.లక్ష విలువ చేసే సోనీ టీవీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆర్డర్ చేయగా.. దానికి బదులు థామ్సన్ టీవీ డెలివరీ అయిన విషయం తెలిసిందే. మరోవ్యక్తి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) నుంచి కిచెన్ చిమ్నీని (Kitchen Chimney) ఆర్డర్ చేయగా.. డ్యామేజ్ అయిన ప్రాడక్ట్ డెలివరీ అయ్యింది. ఈ ఘటనతో అతడు కూడా ఒకింత అసహనానికి గురై.. ఇలానే సోషల్ మీడియా ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నాడు.
Also Read..
Bus Tickets | ఇకపై వాట్సాప్ ద్వారా బస్ టికెట్లు.. ఢిల్లీ సర్కార్ యోచన
Schools Reopen | తమిళనాడు వ్యాప్తంగా తెరుచుకున్న విద్యాసంస్థలు
Article 370 | ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు