Schools Reopen | తమిళనాడు వ్యాప్తంగా తెరుచుకున్న విద్యాసంస్థలు
Schools Reopen | మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకున్నాయి (Schools Reopen).
Schools Reopen | మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకున్నాయి (Schools Reopen). తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షం కారణంగా వారం రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ పలు ప్రాంతాల్లో వరద తొలగిపోకపోవడంతో పాఠశాలలను తెరవలేదు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి సద్దుమణగడంతో పాఠశాలలను తెరిచారు.
తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో గత వారం నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో పాఠశాలలు, కళాశాలలు, అన్ని విద్యాసంస్థలు మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. పుదుచ్చేరి, కరైకల్, యానాం ప్రాంతాల్లోని పాఠశాలలు కూడా డిసెంబర్ 4, 5 తేదీల్లో మూతపడిన విషయం తెలిసిందే. పల్లవరం, తాంబరం, వండలూరు, తిరుపోరూర్, చెంగల్పట్టు, తిరుకజుకుండ్రంలలో కూడా పాఠశాలలు మూసివేయబడ్డాయి. ప్రస్తుతం అన్ని పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి.
#WATCH | Schools in Chennai reopen after remaining closed for a week due to the impact of Cyclone Michaung pic.twitter.com/TxKSCobWOt
— ANI (@ANI) December 11, 2023
Also Read..
Article 370 | ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
IT Raids | ఐటీ దాడుల్లో పట్టుబడిన రూ.351 కోట్లు.. ఆ నగదును ఏ బ్యాంక్లో జమచేయనున్నారంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

