Bus Tickets | ఇకపై వాట్సాప్ ద్వారా బస్ టికెట్లు.. ఢిల్లీ సర్కార్ యోచన
Bus Tickets | ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు దిల్లీ సర్కార్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వాట్సాప్ (WhatsApp) ద్వారా బస్ టికెట్లు (Bus Tickets) జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
Bus Tickets | ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు దిల్లీ సర్కార్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వాట్సాప్ (WhatsApp) ద్వారా బస్ టికెట్లు (Bus Tickets) జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ తరహా సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు బస్సుల్లోనూ విస్తరించేందుకు నడుం బిగించింది. త్వరలోనే దీనిపై ప్రయాణికులకు శుభవార్త చెబుతామని అక్కడి అధికారులు వెల్లడించారు.
అయితే, వాట్సాప్ ద్వారా కొనుగోలు చేసే టికెట్ల సంఖ్యపై పరిమితి ఉంటుంది. వాట్సాప్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్‌ను రద్దు చేసుకునే వెసులుబాటు మాత్రం ఉండదు. క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే చిన్న మొత్తంలో కన్వీనియెన్స్ ఫీజు కూడా వసూలు చేస్తారు. యూపీఐ ఆధారిత పేమెంట్స్‌కు మాత్రం ఎలాంటి అదనపు రుసుము ఉండదు. ఇక హైదరాబాద్ మెట్రో కూడా వాట్సాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే.
Also Read..
Schools Reopen | తమిళనాడు వ్యాప్తంగా తెరుచుకున్న విద్యాసంస్థలు
Article 370 | ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
IT Raids | ఐటీ దాడుల్లో పట్టుబడిన రూ.351 కోట్లు.. ఆ నగదును ఏ బ్యాంక్‌లో జమచేయనున్నారంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

