హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. రూ.2 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న సంస్థ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ..తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టింది. దక్షిణాదిలో తన తొలి హౌజింగ్ ప్రాజెక్టును హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. రూ.2 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించతలపెట్టిన ఈ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టును కోకాపేట్‌లోని గోల్డెన్ మైల్ రోడ్డులో నిర్మించబోతున్నది.
హైదరాబాద్, ఆగస్టు 11 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ..తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టింది. దక్షిణాదిలో తన తొలి హౌజింగ్ ప్రాజెక్టును హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. రూ.2 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించతలపెట్టిన ఈ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టును కోకాపేట్‌లోని గోల్డెన్ మైల్ రోడ్డులో నిర్మించబోతున్నది. 65 అంతస్తుల రెండు టవర్లలో 450 అపార్ట్మెంట్లు, 16 పెంట్‌హౌస్‌లను 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నది. త్వరలో భూమి పూజ చేయనున్న ఈ లగ్జరీ ప్రాజెక్టును ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియల్టీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముంబైకి చెందిన ట్రిబెకా డెవలపర్స్ వర్గాలు వెల్లడించాయి.
భారత్‌లో ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టులను ఈ రియల్ ఎస్టేట్ సంస్థనే నిర్మిస్తున్నది. ఇప్పటికే ఎనిమిది ప్రాజెక్టులను పుణె, ముంబై, కోల్‌కతా, గురుగ్రామ్‌ల్లో నిర్మించినట్టు ట్రిబెకా డెవలపర్స్ ఫౌండర్ కల్పేష్ మెహతా తెలిపారు. దక్షిణాదిలో నిర్మిస్తున్న తొలి రెసిడెన్షియల్ ప్రాజెక్టు ఇదేనని ఆయన వెల్లడించారు. ఈ లగ్జరీ ప్రాజెక్టునకు రెరా అనుమతులు కూడా లభించాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,700 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నట్టు, అలాగే భూమి కోసం అదనంగా రూ.250 కోట్ల నిధులను వెచ్చించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తైన తర్వాత అపార్ట్మెంట్ల విక్రయం ద్వారా రూ.3,500-4,200 కోట్ల వరకు ఆదాయం సమకూరవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటికే ఎనిమిది పెంట్‌హౌస్‌లు అమ్ముడయ్యాయని, వీటి మొత్తం విలువ రూ.250 కోట్లని వెల్లడించారు. అలాగే రూ.62 కోట్ల విలువైన మరో పెంట్‌హౌజ్ కూడా అమ్ముడైందన్నారు.
ట్రంప్ టవర్స్ వివరాలు
- 65 అంతస్తులతో రెండు టవర్ల నిర్మాణం
- దీంట్లో 450 అపార్ట్మెంట్లు, 16 పెంట్‌హౌస్
- ఒక్కో అపార్ట్మెంట్ ధర రూ.5 కోట్లుగా నిర్ణయించింది.
- 3, 4,5 బీహెచ్‌కే ప్లాట్లు నిర్మిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

