అమరావతి : ఏపీలో జరిగిన డీఎస్సీ-2025 ఉద్యోగ నియమకాల్లో ( DSC irregularities) జరిగిన అక్రమాలపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ( AP Governor ) ను వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి( YS Jagan ) కలిసి ఫిర్యాదు చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐచే విచారణ జరిపించాలని కోరారు. అదేశిదంగా స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఆంధ్రప్రదేశ్ ( శాప్) కార్యాలయం వద్ద వైసీపీ నాయకులపై దాడి గురించి కూడా ఫిర్యాదు చేశారు.
అంతకు ముందు గ్రేటర్ విశాఖపట్నం నాయకులతో తాడేపల్లిలోని పార్టీకార్యాలయంలో సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలకు చేస్తున్న మోసాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో ప్రజలకు జరిగిన మేలును గుర్తు చేయాలని సూచించారు. విశాఖ తాగునీటి సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అదేవిధంగా విశాఖలో తన కుటుంబ సభ్యులకు అప్పనంగా అప్పగిస్తున్న ప్రభుత్వ భూములపై అలుపెరగని పోరాటం చేయాలని హితబోధ చేశారు.
కూటమి పాలనలో జరుగుతున్న అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీ వ్యవహారమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అన్యాయానికి పాల్పడుతున్న పోలీసుల వివరాలను డిజిటల్ డైరీలో నమోదు చేయాలని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ డైరీని ఓపెన్ చేస్తామని అన్నారు. టోపీపై ఉండే సింహాలకు మాత్మ్రే తలవంచాలని, చంద్రబాబుకు కాదని పోలీసులకు సూచించారు.