వర్షాకాలంలో సూపర్ ప్యాసేజ్ పనులా?
కేఎల్ఐ డీ-8 కాలువపై సూపర్ ప్యాసేజ్ (ఎస్పీ) పనులు చేపట్టినా క్యూరింగ్ చేయకపోవడం, ఎస్పీ కింద వేసిన మట్టిని తొలగించకపోవడం, ప్రస్తుతం కాలువకు నీటిని వదిలితే ముందుకు పారే అవకాశం లేకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
- కేఎల్ఐ డీ-8 కాలువపై మట్టిని తొలగించాలి.. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
గోపాల్పేట, ఆగస్టు 11 : కేఎల్ఐ డీ-8 కాలువపై సూపర్ ప్యాసేజ్ (ఎస్పీ) పనులు చేపట్టినా క్యూరింగ్ చేయకపోవడం, ఎస్పీ కింద వేసిన మట్టిని తొలగించకపోవడం, ప్రస్తుతం కాలువకు నీటిని వదిలితే ముందుకు పారే అవకాశం లేకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చాకల్‌పల్లి శివారులో ఎస్పీ పనులు జరుగుతున్న కేఎల్ఐ డీ-8 కాలువ వద్దకు రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు.
అక్కడే వారు మీడియాతో మాట్లాడుతూ.. కాలువల ద్వారా కేఎల్ఐ నీటిని వదిలి చెరువులు, కుంటలు నింపి సకాలంలో సాగునీరు అందించాల్సిన ప్రభుత్వం.. నీటిని విడుదల చేసే సమయంలో డీ-8 కాలువపై సూపర్ ప్యాసేజ్ పనులు అడ్డంగా చేపట్టారని మండిపడ్డారు. కాలువకు అడ్డంగా మట్టి పోసి ఎస్పీ పనులు చేపడితే నీళ్లు ఎలా ముందుకు పారుతాయని కాంట్రాక్టర్, అధికారులను ప్రశ్నించారు. ఎండాకాలంలో చేపట్టాల్సిన పనులు ఇప్పుడు చేయడం సరికాదని అన్నారు. సూపర్ ప్యాసేజ్ పనులకు క్యూరింగ్ సరిగ్గా చేయలేదని ఆరోపించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా సాగునీరు అందించాలని అధికారులను డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS leaders
- KLI
- KLI D-8 canal
- soil
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

