ఖమ్మం : కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఊరు వదిలి వెళ్లిపోయాడు. ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌లో తమ ఇళ్లను అక్రమంగా కూల్చివేయడాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన బాధితుల ఆవేదనను, వారి వీడియోలను సదరు ఇన్ఫ్లూయెన్సర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేశాడు. ఈ క్రమంలో అతడికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి బెదిరింపు మెసేజ్‌లు, హెచ్చరికలు వచ్చాయి.
దీంతో ఖమ్మం వదిలి వెళ్తున్నానని, శ్రీనివాసనగర్‌కు సంబంధించిన వీడియోలు అన్నీ డిలీట్ చేస్తున్నానని ఆవేదనతో మరో వీడియో చేశాడు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వీడియోలు చేయకండి, రిస్క్‌లో పడకండి అంటూ తన ఆవేదనను వెలిబుచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతారా అదేనా ప్రజాపాలన అని నెటిజన్లు కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు ఊరు వదిలి వెళ్ళిపోయిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపులు
ఖమ్మంలో శ్రీనివాసనగర్‌లో తమ ఇళ్లను అక్రమంగా కూల్చివేయడాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన బాధితుల ఆవేదనను, వారి వీడియోలను పోస్ట్ చేసిన ఇన్… https://t.co/GAcxZpbrNl pic.twitter.com/K4C1WqXduZ
— Telugu Scribe (@TeluguScribe) September 18, 2026