బూర్గంపహాడ్, సెప్టెంబర్ 18 : గురువారం సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన ఈదురు గాలులకు ఓ ఇంటిపై భారీ వృక్షం కూలింది. దీంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోతే పట్టీనగర్లో ప్రధాన రహదారి పక్కనే ఉన్న మడకం లక్ష్మి ఇంటిపై ఈదురు గాలులకు పక్కనే ఉన్న భారీ వృక్షం విరిగి ఆ ఇంటిపై పడింది. దీంతో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో పాటు ఇంటి గోడలు, రేకులు పూర్తిగా విరిగిపోయాయి. ఈ ఘటన జరిగి గంటలు దాటినప్పటికీ పంచాయతీ సిబ్బంది స్పందించకపోవడంతో నిరుపేద కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సంబంధిత అధికారులు స్పందించి పంచాయతీ సిబ్బందిచే ఇంటిపై పడిన వృక్షాన్ని తొలగించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున సాయం చేయాలని కోరుతున్నారు.