Delhi : దేశ రాజధాని ఢిల్లీలో హిట్ అండ్ డ్రాగ్ కేసు నమోదైంది. ఒక వృద్ధుడు కారు నడుపుతూ బైకును ఢీకొట్టాడు. అనంతరం ఆగకుండా ఆ బైకును అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన ఢిల్లీ, ఆర్కే పురం, ఆఫ్రికా అవెన్యూ రోడ్లో, గురువారం రాత్రి జరిగింది. కారు నడిపింది 73 ఏళ్ల వృద్ధుడిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. రాత్రి పూట ఆఫ్రికా అవెన్యూ రోడ్డులో 21 ఏళ్ల తనిష్ టోకాష్ అనే ఒక వ్యక్తి రోడ్డు పక్కన బైకు ఆపి, దానిపై కూర్చుని ఉన్నాడు. ఇదే సమయంలో హోండా అమేజ్ కారు వచ్చి, ఆ బైకును ఢీకొంది.
ఆ డ్రైవర్ కారు ఆపకుండా బైకును ఈడ్చుకుంటూ అర కిలోమీటర్ దూరం వరకు వెళ్లాడు. అలా, కొంత దూరం వెళ్లిన తర్వాత బైకు ఇరుక్కుపోవడం వల్ల కారు దానికిదే ఆగిపోయింది. అయితే, బైకును కారు ఢీకొనడంతో బైకుపై కూర్చున్న తనిష్ కొంతదూరం ఎగిరిపడ్డాడు. అతడికి స్వల్ప గాయాలయ్యాయి. బైకును మాత్రమే ఆ కారు ఈడ్చుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారు తమ మొబైల్స్‌లో బంధించారు. ఇతరులు వచ్చి, సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 10.00 గంటల సమయంలో ఈ ఘటన జరగగా, స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు.
🚨 CAR DRAGS BIKE FOR SEVERAL METRES IN DELHI’S RK PURAM
A video from RK Puram, Delhi shows a car dragging a motorcycle trapped underneath it on Africa Avenue Road.
The incident took place on September 17. Delhi Police said the motorcycle rider fell after the car hit his parked… pic.twitter.com/Dkfx8CEXQu
— contentkikamii (@contentkikamii) September 18, 2026
ఈ ఘటన అనంతరం కారు నడిపిన వ్యక్తిని స్తానికులు పట్టుకున్నారు. డ్రైవర్‌ను 73 ఏళ్ల వేణు గోపాల్‌గా గుర్తించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. బాధితుడు తనిష్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడికి స్వల్ప గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ అంశంలో డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.